ఆంధ్రప్రదేశ్

యువతకు ఉపాధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత_

యువతకు ఉపాధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత_

జనం న్యూస్ సెప్టెంబర్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ఉషాకిరణ్ ఐటీఐ వద్ద యువత భవితకు భరోసా కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 10వేలకు పైగా,డీఎస్సీ ద్వారా 16వేల ఉద్యోగాలు కల్పించామని,ఈ ఏడాది మరో 3వేల పోలీస్,3వేల టీచర్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని తెలిపారు.తల్లికి వందనం,మధ్యాహ్న భోజనం,ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని,ఏపీఎస్ఎస్డీసీ శిక్షణ,ఉద్యోగ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి,అధికారులు,విద్యార్థులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్