ఆంధ్రప్రదేశ్

గణేష్ నిమజ్జనం తీసుకొని వెళ్లేటప్పుడు అధిక శబ్దంతో డీజేలు నిర్వహించకూడదు ఎస్సై పరమేశ్వర్

గణేష్ నిమజ్జనం తీసుకొని వెళ్లేటప్పుడు అధిక శబ్దంతో డీజేలు నిర్వహించకూడదు ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గణేష్ నిమజ్జనం సందర్భంగా శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు డీజే నిర్వాహకుల బైండోవర్గ ణేష్ నిమజ్జనం.కార్యక్రమాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించుకోవాలని ఎస్సై జక్కుల పరమేశ్వర్ అన్నారు అనంతరం ఎస్సై మాట్లాడుతూ నిమజ్జనం తీసుకు వెళ్లేటప్పుడు అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో భాగంగా, మండల పరిధిలోని సుమారు 20 మంది డీజే నిర్వాహకులను గుర్తించి, తాహసిల్దార్ సమక్షంలో బైండోవర్ చేయడం జరిగింది. డీజే నిర్వాహకులకు నిర్దేశిత శబ్ద పరిమితులు, సమయ పరిమితులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన సూచనలు తెలిపారు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేశారు.

ఇ-పేపర్