జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 23-09-2026 బుధవారం తోమాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్హెచ్ 44 హైవే రోడ్డు మలుపుల దగ్గర సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నిరంతరం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ విషయంలో కాంట్రాక్టర్ గారు వెంటనే మలుపుల దగ్గర ఉన్న గుంతలను పూడ్చి రోడ్లను సరిచేసి వాహనాలకు సరైన దిశా నిర్దేశం చేసే బోర్డులను ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గుడిసె అశోక్ కుమార్ గారు కాంట్రాక్టర్ దృష్టికి అలాగే పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పెబ్బేరు పోలీస్స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్ గౌడ్ గారు రోడ్లను పరిశీలించి వెనువెంటనే సరి చేయాలని కాంట్రాక్టర్ తో మాట్లాడి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.