జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో గల గుడి చెరువులో విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ మాట్లాడుతూ ప్రజలందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో, చిట్టి రమేష్, అన్న అశోక్, ముజిగిరి రాకేష్, అమ్మ నిహాన్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.