జనం న్యూస్ 25 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్జి ల్లా ఆరోగ్యంతో చెలగాటం తాత్కాలిక బలం కోసం ఇంజెక్షన్ల వినియోగం అక్రమ సరఫరాపై నిఘా అవసరం గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు యువత తాత్కాలిక శారీరక బలం కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విచక్షణారహితంగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సందెరాళ్ల (బరులు) ఎత్తే పోటీల నేపథ్యంలో వైద్యుల సూచనలు లేకుండా మోతాదుకు మించి ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఇలాంటి ఇంజెక్షన్ల వినియోగంతో కొందరు యువకులు అనారోగ్యానికి గురవుతున్నారని కుటుంబ సభ్యులపై దాడులు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా ఘటనలకు స్టెరాయిడ్ వినియోగమే కారణమని అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంజెక్షన్లు మందులు అక్రమంగా సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. యువత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజెక్షన్ల విక్రయాలు అక్రమ సరఫరాపై నిఘా పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.