ఆంధ్రప్రదేశ్

బిచ్కుంద ప్రభుత్వ దవఖానను పరిశీలించిన కామారెడ్డి జిల్లా వైద్య అధికారి వెంకటి

బిచ్కుంద ప్రభుత్వ దవఖానను పరిశీలించిన కామారెడ్డి జిల్లా వైద్య అధికారి వెంకటి

బిచ్కుంద, సెప్టెంబర్ 25 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కేంద్రంలోని గురువారం రోజు కామారెడ్డి జిల్లా వైద్య అధికారి వెంకటి బిచ్కుంద ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసినారు అనంతరం ఆయన మాట్లాడుతూ. ముందుగా దవాఖానలోని రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించి వివరాలు సేకరించారు. మందుల నిల్వ వివరాలు, ఫార్మసిస్టుతో మాట్లాడుతూ మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. మరియు వైద్యులు తమ విధులపై నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా వైద్య అధికారి ఆదేశించారు. అనంతరం బిచ్కుంద మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఓ ప్రైవేటు దవాఖాన ఎదుట జనాలు గుమిగూడి ఉండడం చూసి ఏమైందంటూ ఆరా తీశారు. ప్రైవేటు దవాఖాన ఎదుట చికిత్స కోసం రోగులు గుమిగూడి ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే ప్రైవేటు దవాఖానను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా కొనసాగుతున్న దవాఖానను సీజ్ చేశారు. ఆయనవెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ కుమార్, వైద్యుడు కాశీదాస్, దవాఖాన సిబ్బంది ఉన్నారు.

ఇ-పేపర్