ఆంధ్రప్రదేశ్

చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం – బండి రమేష్

చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం – బండి రమేష్

జనం న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తూర్పు కమాన్ వద్ద ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టి పి సిసి ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శప్రాయమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, గుడెపు నాగరాజు, కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు కావేటి నాగార్జున, రంగమోహన్, మేకల మహేష్, రమణ, కూకట్‌పల్లి రజక సంఘం అధ్యక్షుడు బాలరాజుతో పాటు రజక సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

ఇ-పేపర్