వైరల్ వార్తలు

టంగుటూరు పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు వేళల మార్పుపై వినతి

టంగుటూరు పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు వేళల మార్పుపై వినతి

జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా కడప జిల్లా నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపా ధ్యాయుల సౌకర్యార్థం ఏపీ ఎస్ఆర్టీసీ బస్సు వేళలను పాఠశాల సమయానికి అనుగుణంగా మార్చాలని కోరుతూ టంగుటూరు గ్రామ యువ నాయకులు రాజంపేట డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యువ నాయ కులు గుజ్జల ఈశ్వరయ్య, వలిమి అరవింద్ బాబు, అనిక నవీన్ కుమార్, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు షేక్ అల్లా బకాష్ తదితరులు డిపో మేనేజర్‌కు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సు సమయాలు పాఠశాల వేళలకు అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, బస్సు సమయాలను సవరించడం ద్వారా విద్యా వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన రాజంపేట డిపో మేనేజర్ సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని, పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిపో మేనేజర్ సానుకూల స్పందనపై గ్రామ యువ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్