జనం న్యూస్ 26 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్తె లంగాణ సాయుధ పోరాట వీరనారి, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి వేడుకలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా . ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ నాటి నైజాం భూస్వామ్య వ్యవస్థకు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ, అని కొనియాడారు. తన భూమి కోసం హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం దేశ చరిత్రలోనే అద్వితీయమైనదని గుర్తుచేశారు. ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట పటిమ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇంచార్జ్ యు రాముడు, కార్యక్రమంలో టి ఆర్ పి ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. తెలంగాణ నిజాం రజాకార్ల సాయుధ పోరాటంలో ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గెలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయిజ మండల ప్రధాన కార్యదర్శి రాజాపురం ఇ .సురేందర్ గౌడ్ బిల్డర్ నరసింహ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ భాస్కర్ కె రాముడు, బీమేష్ టి జై ఎ సి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు చిట్టెం కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.