జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం ఐ పోలవరం గ్రామపంచాయతీ పెదమడి శెట్టిబలిజ గ్రామంలో యువతీ యువకులు కోదండ రామస్వామి వారి ఆలయంలో గణపతి స్వామి మండపం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏకాహ భజన కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు హిందూ ధర్మ విశిష్టతను పెద్దలచే తెలియపరుస్తూ ఈరోజు మండపం వద్ద గ్రామస్తులచే భారీ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ధర్మ ప్రచారకులు బొంతు కనకారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణహితముగా కార్యక్రమాలు చేపట్టాలని ప్లాస్టిక్ నిషేధించాలని నీటిని కలుషితం కాకుండా చూడాలని చిన్నతనం నుండి పిల్లలకు మన ఆచార సంప్రదాయాలను తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సానబోయిన రాంబాబు మేడిశెట్టి వెంకటేశ్వరరావు గుత్తుల వెంకటేశ్వరరావు పాటి వీరన్న బాబు గుబ్బల శ్రీనివాస్ మేడిశెట్టి గంగిశెట్టి చప్పిడి దానేశ్వరరావు పాటి హరికృష్ణ పాటి కాశి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.