ఆంధ్రప్రదేశ్

కీర్తిశేషులు బొడ్డు విష్ణుమూర్తి మరణం పార్టీకి తీరని లోటు

కీర్తిశేషులు బొడ్డు విష్ణుమూర్తి మరణం పార్టీకి తీరని లోటు

కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్జ నం న్యూస్, సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ ) రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు విష్ణుమూర్తి అకాల మరణం పార్టీకి, కాజులూరు మండల ప్రజలకు తీరని లోటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం ఆర్యవటం గ్రామంలోని విష్ణుమూర్తి స్వగృహానికి వెళ్లిన మంత్రి సుభాష్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ బొడ్డు విష్ణుమూర్తి ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడని, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన అంకితభావం కలిగిన కార్యకర్త అని కొనియాడారు. మండల పరిషత్ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా సేవలందించారని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని మంత్రి తెలిపారు. విష్ణుమూర్తి మరణంతో పార్టీ ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుమూర్తి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని, వారి కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల బుల్లిరాజు, కొల్లి హనుమంతరావు , చందాల మల్లిబాబు, చందాల ఆదినారాయణ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్