కాట్రేనికోన మండలం 92వ బూత్ లో మోదీ ప్రసంగం విన్న జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ బృందం
జనం న్యూస్,సెప్టెంబర్27,(ముమ్మిడివరం ప్రతినిధి) ,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం 92వ బూత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ రేడియో ప్రసార కార్యక్రమం ఆదివారం ఉదయం 11 గంటలకు డిడి ఛానల్ ద్వారా ప్రసారం కాగా బీజేపీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ,సత్యనారాయణ,నూకల సాయి తదితర కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.మోదీ ప్రజలతో పంచుకున్న అంశాలను శ్రద్ధగా విన్నామని,ప్రధాని ఇచ్చిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని గ్రంధి నానాజీ తెలిపారు.మన్ కీ బాత్ ద్వారా దేశభక్తి,సామాజిక స్ఫూర్తి పెరుగుతోందని,ప్రతి నెలా మోదీ చెప్పే మాటలు యువతకు స్ఫూర్తిదాయకమని,బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.