ఆంధ్రప్రదేశ్

డాక్టర్ సత్యం శ్రీరంగం గారి డ్రైవర్ జి. రాజు దశదిన కర్మకు హాజరైన బండి రమేష్

డాక్టర్ సత్యం శ్రీరంగం గారి డ్రైవర్ జి. రాజు దశదిన కర్మకు హాజరైన బండి రమేష్

జనం న్యూస్ సెప్టెంబర్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం డ్రైవర్ జి. రాజు దశదిన కర్మ కార్యక్రమానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరై జి. రాజు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ జి. రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జి. రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుష్ప రెడ్డి, గాలి బాలాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కృష్ణ రాజ్‌పుత్, శ్రీకాంత్ పటేల్, శివ చౌదరి , వాసు మరియు డివిజన్ అధ్యక్షులు నాగార్జున, శివగౌడ్, రాజేష్ గౌడ్, అరవింద్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు రమాదేవి, స్వరూప గౌడ్, బండి సుధ, జ్యోతి, కృష్ణవేణి తదితరులు పాల్గొని జి. రాజుకు నివాళులర్పించారు.

ఇ-పేపర్