బిచ్కుంద సెప్టెంబర్ 28 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుంద లో యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో “నషాముక్త్ భారత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కె అశోక్, వైస్ ప్రిన్సిపల్ డా జి వెంకటేశం, యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్ డా కె అశోక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు