ఆంధ్రప్రదేశ్

నాడు సర్పంచ్ గా నేడు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గా గండ్ర సత్యనారాయణ రావు

నాడు సర్పంచ్ గా నేడు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గా గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి బుద్ధారం గడ్డపై మొదలైన అడుగు,ప్రజల గుండెల్లో వేసింది బలమైన ముద్ర. నాడు సర్పంచ్‌గా సేవకు శ్రీకారం చుట్టి, నేడు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే
సాగింది ఆయన ప్రస్థానం..! పదవి మారినా.. పంథా మారలేదు,అధికారం వచ్చినా. ఆత్మీయత తగ్గలేదు. ప్రజల కష్టమే తన కష్టమని భావించి, ప్రజల మనిషిగా నిలిచాడు గండ్ర సత్యనారాయణ రావు గ్రామం నుంచి నియోజకవర్గం దాకా,
సేవా బాటలో సాగుతున్న ఆయన అడుగులు. ప్రజలే ఆయన. ప్రయాణానికి చిరునామా. ప్రజలతోనే ప్రస్థానం. ఒక్క గ్రామం నుండి మొదలైన ప్రయాణం, ఏకంగా నియోజకవర్గానికి నాయకత్వమైంది.ఒక్క పదవి నుండి మొదలైన సేవ,ప్రజల అభిమానానికి ప్రతిరూపమైంది..! పదవి మాత్రమే, ప్రజలపై ఉన్న ప్రేమ మాత్రం మారలేదు..! కష్టాల్లో పిలిస్తే పలికే మనసు,సమస్య చెబితే స్పందించే హృదయం. ప్రజల మధ్యే ఉండే నాయకత్వం, అదే ఆయన రాజకీయ ప్రస్థానం..శిలాఫలకం చెబుతున్న కథ:కాలం మారినా. చరిత్ర చెరిగిపోదు. ఏళ్లకు ఏళ్లు గడిచినా. శిలాఫలకం మాట మౌనం కాదు. 1995 నాటి ఆ శిలాఫలకం, ఒక సేవా ప్రయాణానికి సాక్ష్యం. బుద్ధారం గ్రామ సర్పంచ్‌గా వేసిన అడుగు, నేడు శాసనసభలో వినిపిస్తున్న ప్రజావాణి..! నాడు గ్రామం కోసం చేసిన సేవ,నేడు నియోజకవర్గం కోసం సాగుతున్న పోరాటం.పదవులు మారినా. ప్రజల కోసం నడిచే అడుగు, అధికారం కోసం కాదు. అభివృద్ధి కోసం చేసే పరుగు.ప్రజల నమ్మకాన్ని వెంట తీసుకుని, శాసనసభ గడప చేరిన ప్రస్థానం. ప్రజల కన్నీటిలో కనిపించే నాయకుడు, ప్రజల చిరునవ్వులో ఆనందించే నాయకుడు. కాలం ఇచ్చిన పదవులు ఎన్నైనా, ప్రజలిచ్చిన ప్రేమే అసలైన గౌరవం. గ్రామ సమస్యల నుంచి మొదలైన పోరాటం, నియోజకవర్గ సమస్యల వరకు సాగింది. ప్రజలతో నడిచిన ప్రతి అడుగు, 1995 మార్చి 6న బుద్ధారం గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణానికి ధర్మకర్తగా ఉండి ఆలయ స్థాపన వెనుక ముఖ్యపాత్ర పోషించారు. నాటి నుండి నేటి వరకు గ్రామాభివృద్ధిలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తనవంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ వస్తున్నారు.

ఇ-పేపర్