ఆంధ్రప్రదేశ్

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఘన సన్మానo

బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఘన సన్మానo

జనం న్యూస్ 29 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు మండలంలోని పలు గ్రామాలు టంగుటూరు, సాయి గూడెం మదనపల్లి కొల్లూరు షారాజీ పేట అంగన్వాడి కేంద్రాలను బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో సందర్శించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోది జన్మదినం పురస్కరించుకొని నెలరోజులపాటు బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా తలపెట్టిన సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మంగళవారం రోజున మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుమ్మరిండ్ల లక్ష్మీ మహిళా మోర్చా శేషత్వం అర్చనలు పలు గ్రామాల అంగన్వాడీ టీచర్లను ఆశ వర్కర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఆయా గ్రామాల్లోని అంగన్వాడి టీచర్లు జాలపు మమత పిన్నింటి భాగ్య భూపెల్లి సంతోష బి.అండాలు, జే.రాజమణి కోటగిరి బాల నరసమ్మ ఎండి. పర్వీన్ ఎలిజబెత్ ఎలా పద్మ ఆశ వర్కర్లు జి విజయ బి లక్ష్మి గ్యధ పాక లక్ష్మిలను ఘనంగా సన్మానించారు అదేవిధంగా పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కటికే వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్. అమరేందర్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం యాదగిరి కాండ్రాజు శ్రీనివాస్ కార్యదర్శి బైరి మహేంద్ర బీజేవైఎం మండల అధ్యక్షుడు మంత్రి సాయి ప్రసాద్ ఆయా గ్రామాల బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్