ఆంధ్రప్రదేశ్

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఓమ్ని హాస్పిటల్స్ వాక్‌థాన్

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఓమ్ని హాస్పిటల్స్ వాక్‌థాన్

జనం న్యూస్ సెప్టెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓమ్ని హాస్పిటల్స్, కూకట్‌పల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29న వాక్‌థాన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం 6:00 గంటలకు ఓమ్ని హాస్పిటల్స్, కూకట్‌పల్లి నుంచి ప్రారంభమైన ఈ వాక్‌థాన్‌లో ముఖ్య అతిథిగా ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, పూర్ణిమ, సి ఓ ఓ శ్రీ సునీల్, సి బి ఓ హరినాథ్ రెడ్డి, సీ ఏ ఓ తరుణ్పాల్గొని, వైద్యులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి వాక్‌థాన్‌లో నడిచారు. ఈ సందర్భంగా రూ. 6,000 విలువైన కార్డియాలజీ హెల్త్ చెకప్ ప్యాకేజీని కేవలం రూ. 999కే అందుబాటులోకి తీసుకొచ్చారు. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యతను తెలియజేస్తూ పాల్గొన్నవారు వాక్‌థాన్‌లో ముందుకు సాగారు. కార్డియాలజిస్ట్ డా. అతీక్ ఉర్ రెహమాన్ మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, గుండె ఆరోగ్యంపై ముందస్తు శ్రద్ధ వహించడం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.

ఇ-పేపర్