ఆంధ్రప్రదేశ్

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని అబ్దుల్ ఖాదర్ జీలానీ గంధం మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని అబ్దుల్ ఖాదర్ జీలానీ గంధం మహోత్సవం

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 29 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని జెండామాను వీధిలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని అబ్దుల్ ఖాదర్ జీలానీ దర్గా గంధం మహోత్సవం భక్తజన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా దర్గా కమిటీ సభ్యులు నందలూరు మగ్దుమ్ షావలీ దర్గా నుండి చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ సాహెబ్, సయ్యద్ అఖిల్ సాహెబ్‌లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. అనంతరం భారీ బ్యాండ్ మేళాల నడుమ, దర్గా కమిటీ సభ్యులందరి భాగ స్వామ్యంతో పవిత్ర గంధమును ఊరేగింపుగా శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని అబ్దుల్ ఖాదర్ జీలానీ దర్గాకు తీసుకెళ్లారు.​ఈ సంద ర్భంగా రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ రాచూరి మురళి దర్గాకు 30 కేజీల బూందీ ప్రసాదాన్ని సమర్పించారు. అనంతరం ఆయనను దర్గా కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, ఘనంగా గౌరవించారు.​ఈ పావన మహో త్సవంలో భక్తులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, స్వామివారి కృపాకటాక్షాలు మరియు ఆశీస్సులు పొందారు.

ఇ-పేపర్