ఆంధ్రప్రదేశ్

మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.

మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి.

జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు జనం న్యూస్, సెప్టెంబర్ 25,అచ్యుతాపురం : గత వారం రోజులుగా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, తుఫాను పరిస్థితుల కారణంగా చేపల వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమై,జీవనోపాధి కోల్పోయిన అనకాపల్లి జిల్లాకు చెందిన పూడిమడక, తంతడి, ముత్యాలమ్మ పాలెం, తిక్కవాని పాలెం, లోవపాలెం, గజి రెడ్డిపాలెం, వెంకయ్యపాలెం, వాడరాంబిల్లి, వాడ నర్సాపురం, కొత్తపట్నం, బంగారమ్మపాలెం, రేవు పోలవరం మొదలగు మత్స్యకార గ్రామాలకు చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిచి తక్షణమే ఆదుకోవాలని జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
ప్రభుత్వ, వాతావరణ శాఖల హెచ్చరికలు, ఆదేశాలను గౌరవిస్తూ మత్స్యకారులు వారం రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఉండిపోయారని, రోజూ వేటకు వెళ్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్న మత్స్యకార కుటుంబాలు, ఈ వారం రోజులుగా వేట బంద్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని, పిల్లల చదువులు, ఇళ్ల అవసరాలు, నిత్యవసర సరుకులకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో ఉన్న అన్ని మత్స్యకార గ్రామాలుకు ప్రతి మత్స్యకార కుటుంబానికి తక్షణ ఉపశమనంగా రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించాలని, దాంతో పాటు కుటుంబ పోషణకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్య మంత్రికి మరియు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.

ఇ-పేపర్