ఆంధ్రప్రదేశ్

రైతుల ప్రయోజనార్థం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభం

రైతుల ప్రయోజనార్థం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభం

జనం న్యూస్ 28 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ సోషల్ మీడియా అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ ఆదేశాల మేరకు అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు అందేలా అధికారులతో మాట్లాడి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు సుంకేసుల బ్యారేజీకి నీటి ప్రవాహం పెరిగి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఈ విషయంపై డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ అధికారులతో చరవాణిలో మాట్లాడి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ప్రారంభమైంది దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ నీటి విడుదలకు సహకరించిన డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేయడమే నా అంతిమ లక్ష్యం అని తెలిపారు. రైతులు, ప్రజలు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.

ఇ-పేపర్