జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 28. 09. 2026 జహీరాబాద్‌లోని జేజే గార్డెన్స్‌లో సీనియర్ జర్నలిస్ట్ అఖ్తర్ హుస్సేన్ కుమారుడి వలీమా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ అనంతరం నిర్వహించిన వలీమా వేడుకల్లో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్, మల్లేష్, జైపాల్, సుల్తాన్, యూనస్ ఖాన్, ముజాహిద్, షాహెద్ తదితరులు పాల్గొని వధూవరులను అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, జర్నలిస్టులు, స్థానిక ప్రముఖులు పాల్గొనడంతో జేజే గార్డెన్స్‌లో సందడి నెలకొంది.