ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

విద్యుత్‌ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

లైన్ల మార్పు. కొత్త సబ్‌స్టేషన్లు. 3-ఫేజ్‌ విస్తరణపై మంత్రి సమీక్ష తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి వ్యవసాయ పొలాలపై ఉన్న విద్యుత్‌ లైన్లను రోడ్డు పక్కకు మార్చాలి నియోజకవర్గంలో 3-ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను విస్తరించాలి జనం న్యూస్ సెప్టెంబర్ 28 కోటబొమ్మాళి మండలం :తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్‌ సరఫరా అంతరాయానికి గురికాకుండా ముందస్తు చర్యలతో విద్యుత్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, లైన్ల పునరుద్ధరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, వ్యవసాయ పొలాలపై ఉన్న 33 కేవీ, 11 కేవీ లైన్లను రోడ్డు పక్కకు రిరూటింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో 3-ఫేజ్‌ సరఫరా విస్తరణ, కొత్త సబ్‌స్టేషన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ మార్గాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ సమయంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ఎక్కువ సమయం పట్టకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, దెబ్బతిన్న లైన్లను వెంటనే పునరుద్ధరించి ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ పొలాలపై లైన్ల రిరూటింగ్‌*
వ్యవసాయ పొలాలపై నుంచి వెళ్తున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లను రోడ్డు పక్కకు రిరూటింగ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా, భవిష్యత్తులో బ్రేక్‌డౌన్లు, విద్యుత్‌ అంతరాయాలు తగ్గేలా లైన్లను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో CC రోడ్ల నిర్మాణం కారణంగా ప్రస్తుతం రోడ్ల మధ్యలో ఉన్న 33 కేవీ, 11 కేవీ, LT విద్యుత్‌ లైన్లను భద్రతా దృష్ట్యా రోడ్డు పక్కకు మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1 కేవీ ఫీడర్ల విస్తరణకు చర్యలు తుఫాన్‌ వంటి విపత్తుల సమయంలో విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరించేందుకు అన్ని 11 కేవీ ఫీడర్‌ లైన్లను బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. 6.3 కేవీ లైన్లను 11 కేవీ లైన్లకు అనుసంధానించి, 3-ఫేజ్‌ నెట్‌వర్క్‌ ఉన్న గ్రామాల వరకు విస్తరించే ప్రతిపాదనలను పరిశీలించాలని ఆదేశించారు.
నాలుగు మండలాల్లో 3-ఫేజ్‌ సరఫరా* టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం మండలాల్లోని ప్రధాన గ్రామాలకు 3-ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్‌ అవసరాలు, గ్రామీణ ప్రాంతాల భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులను బలోపేతం చేయాలని సూచించారు. కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త సబ్‌స్టేషన్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా, తబొమ్మాళి సెక్షన్‌ – పాతమేగవరం, కోటబొమ్మాళి సెక్షన్‌ – జర్గంగి, జయ్యన్నపేట,టెక్కలి సెక్షన్‌ – జగతిమెట్ట ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.నౌపాడ–బొరుభద్ర 33 కేవీ ఇంటర్లింకింగ్‌ నౌపాడ, బొరుభద్ర సబ్‌స్టేషన్ల మధ్య 33 కేవీ ఇంటర్లింకింగ్‌ లైన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల ఒక సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మరో సబ్‌స్టేషన్‌ నుంచి ప్రత్యామ్నాయ సరఫరా అందించే అవకాశం ఉంటుందని, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ పునరుద్ధరణను వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఈఈ జి,ఎన్‌, ప్ర‌సాద్‌, డీఈ న‌ర‌సింహ‌, ఏఈ పాల్లొన్నారు.

ఇ-పేపర్