జనం న్యూస్, సెప్టెంబర్ 30,అచ్యుతాపురం : గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అచ్యుతాపురం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైస్సార్ నగర్ ఎంపీయుపి స్కూల్ దగ్గర అక్టోబర్ 2 శుక్రవారం ఉదయం 9 గంటలు నుండి మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని నిర్వాహకులు రాజాన సంజీవ్ మరియు వారి మిత్ర బృందం తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో యువత, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.