జనం న్యూస్, సెప్టెంబర్ 30: ముమ్మిడివరం ప్రతినిధి గంజి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం
క్యాలెండర్ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ నెల నాలుగో బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం అమలాపురం కొంకాపల్లి పల్లంరాజు స్వగృహం నందు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి అధ్యక్షతన జరిగింది._ ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. 1. గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జ్ని నియమించేందుకు ధన్యవాద తీర్మానం – గన్నవరం నియోజకవర్గం ఇన్చార్జ్ నియమించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు ప్రధానకార్యదర్శికి అభినందనలు మరియు ధన్యవాదములు తెలియజేస్తారు. 2. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా గంధం పల్లంరాజును ఎంపిక చేయాలని – జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి గంధం పల్లంరాజును జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించాలని జిల్లా పార్టీ తరఫున తీర్మానం చేయడమైనది. 3. అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని తీర్మానం – పెన్షన్ నమోదు ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా పార్టీ తరఫున కోరుతూ తీర్మానం చేయడమైనది.4.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని తీర్మానం – ముందుగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని అందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని జిల్లా పార్టీ సభ్యులు కోరడమైనది.అదేవిధంగా పురపాలకల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తీర్మానించడమైనది. 5. D2D విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానం – 45 రోజుల డోర్ టు డోర్ కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసినందుకు జిల్లా కమిటీ సభ్యులు పార్టీ నాయకులకు,కార్యకర్తలకు అభినందనలతో తీర్మానం చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి గంధం పల్లంరాజు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని రిజర్వేషన్ ఆధారంగా తాను జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అందుకు మీరందరూ సహకరించగలరని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, మొల్లేటి శ్రీను, మాడా మాధవి,కా శి శ్రీనివాసరావు, చెల్లింగి అబ్బులు, నిమ్మకాయల సూర్యనారాయణ మూర్తి, దేవు వెంకటరాజు,పిన్నమరాజు శ్రీనివాసరాజు, చుట్టుగుల్ల దుర్గావతి కిషోర్, గుబ్బల నాగేశ్వరరావు, గుమ్మడి నాగమణి, కొక్కిరి లక్ష్మి, సాకా సీతాదేవి, రాణి శ్రీనివాసశర్మ, వనుం వీరబ్రహ్మం, వాడ్రేవు వీరబాబు, కంచర్ల లక్ష్మణరావు, కంకటాల రామం, యాళ్ల ఉదయ్, వెంట్రు సుధీర్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.