ఆంధ్రప్రదేశ్

కస్తూర్బా గాంధీ విద్యాలయంను సందర్శించిన అదనపు కలెక్టర్ ఎన్ రవి

కస్తూర్బా గాంధీ విద్యాలయంను సందర్శించిన అదనపు కలెక్టర్ ఎన్ రవి

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతులను హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌. రవి బుధవారం రోజున అకస్మాత్తుగా సందర్శించారు కిచెన్, స్టోర్ రూమును పరిశీలించి అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, తదితర సౌకర్యాలపై పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాదవి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో అదనపు కలెక్టర్‌ విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకన్న తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కస్తూర్బా గాంధీ బాలికల టీచర్ శ్రావణి పాల్గొన్నారు.

ఇ-పేపర్