జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 01-10-2026 నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ (NIDJAM) *లో సెయింట్ థామస్ హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. అండర్-14 విభాగంలో అర్జున్ కిడ్స్ జావెలిన్ త్రోలో ప్రథమ స్థానం సాధించి, ట్రయాథ్లాన్-Bలో ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే అండర్-16 విభాగంలో అరుణ్ హైజంప్‌లో ద్వితీయ స్థానం, జావెలిన్ త్రోలో తృతీయ స్థానం సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందిస్తాయి” అని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.