గాంధీ జయంతి సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు నివాళులు జనం న్యూస్, అక్టోబర్ 02: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏర్గట్ల మండలంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, పచ్చదనం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణానికి.