ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీ జయంతి వేడుక

మహాత్మా గాంధీ జయంతి వేడుక

జనం న్యూస్ అక్టోబర్ 2 మహాముత్తారం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య,ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పింఛీ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా, జాడి రాజయ్య,మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు, ఆయన చూపిన అహింసా మార్గం, సత్యం మరియు సేవా భావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం గాంధీజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన సిద్ధాంతాలు నేటికీ ఎంతో ప్రాసంగికత కలిగి ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీజీ ఆశయాల సాధనకే కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గాంధీజీకి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఎలక్షన్ క్యాంపెనింగ్ జాయింట్ కన్వీనర్ ఇనుకొండ వెంకటరెడ్డి, కాటారం డివిజన్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండ గొర్ల బాబు, EX ZPTC లింగమల శారద దుర్గయ్య, మహిళా మండల అధ్యక్షురాలు ధరంసోత్ సుజాత,PACS మాజీ చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, మహిళా మండల్ ఉపాధ్యక్షురాలు బౌతు రమ్య,యామాన్ పల్లి సర్పంచ్ అట్టెం రమేష్, కనుకునూర్ సర్పంచ్, పులిసె సుమలత రాజు,మహా ముత్తారం గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమల రాజయ్య, మహా ముత్తారం ఉపసర్పంచ్ రామ్నేని పూజిత కృష్ణంరాజు, మీనాజీ పేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజగోపాల్,పోలరం గ్రామ శాఖ అధ్యక్షుడు, కాల్వపల్లి లింగయ్య, పోలంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రాంనేని వెంకట్రాజం యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గాదే రవీందర్ కొండ గొర్ల అశోక్, పోలారం గ్రామ ఉపాధ్యక్షుడు పంగా దుర్గయ్య, వార్డు మెంబర్ పెరుమాండ్ల రాజేందర్, మాజీ వార్డు మెంబర్లు దామరకుంట తిరుపతి వేముల రఘు,సీనియర్ నాయకులు, తాటి లచ్చయ్య గౌడ్, మోత్కూరు రవి, మోక్క నరసయ్య, చీడెం బాపు, పుట్టల మల్లయ్య, చీటూరి అశోక్,భూక్యా భాస్కర్, మహా ముత్తారం గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, స్తంభంపల్లి పి పి గ్రామ శాఖ యాత్ అధ్యక్షుడు, రాం, సింగంపల్లి గ్రామ యూత్ అధ్యక్షుడు బక్కతట్ల దేవేందర్, మీనాజీపేట గ్రామ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఓడేటి రాజేందర్, నిమ్మగూడెం BLA జాడి సడవలి,యువజన కాంగ్రెస్ నాయకులు, కలవచర్ల రజాకర్, హట్కర్ రాకేష్, ఏనుగు రాజేందర్, మంద జనార్ధన్, జోడే విజేందర్,మరియు మారుపాక రాజేంద్రప్రసాద్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్