తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావు *

జనం న్యూస్ మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ బ్యూరో ఇంచార్జ్ తేదీ17/09/2026 జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గౌరవ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వినాయక మండపాల నిర్వాహకులకు అవసరమైన సహకారం అందిస్తూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.అలాగే మండపాల కమిటీ సభ్యులు కూడా అధికారులకు పూర్తిగా సహకరించి, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మాణిక్ రావు కోరారు.

ఇ-పేపర్