ఆంధ్రప్రదేశ్

అడ్వకేట్ హుస్సేన్‌కు ఘన సన్మానం

అడ్వకేట్ హుస్సేన్‌కు ఘన సన్మానం

జనం న్యూస్ అక్టోబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వక్ఫ్ పరిరక్షణ మరియు సమన్వయ కమిటీ సభ్యుడిగా అడ్వకేట్ హుస్సేన్ నియమితులైన సందర్భంగా, కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో అభినందన మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ హాజరై, అడ్వకేట్ హుస్సేన్‌ను ఘనంగా సన్మానించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, సంబంధిత అంశాల సమన్వయంలో అడ్వకేట్ హుస్సేన్ తన బాధ్యతలను చట్టపరమైన పరిధిలో నిజాయితీ, నిబద్ధత మరియు పారదర్శకతతో నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఆయనకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు, మసీదు మరియు ముస్లిం కమిటీల ప్రతినిధులు, న్యాయవాదులు, వివిధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని అడ్వకేట్ హుస్సేన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ హుస్సేన్ మాట్లాడుతూ, తనను ఈ బాధ్యతకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, న్యాయవాదులు మరియు కమ్యూనిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చట్టపరమైన పరిధిలో నిజాయితీగా, అంకితభావంతో మరియు పారదర్శకంగా నిర్వహిస్తానని తెలిపారు. అడ్వకేట్ హుస్సేన్‌కు నూతన బాధ్యతల్లో విజయం చేకూరాలని కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు మరియు ప్రముఖులు ఆకాంక్షించారు.

ఇ-పేపర్