కల్పించవలసిం దిగా వినతిపత్రం సమర్పించిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఏకశిలా నగరం అయిన సబ్ టైటిల్ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి సేవలో రైల్వే గుంతకల్ ఏ డి ఆర్ ఎం శివ ప్రసాద్ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట మండలం చారిత్రక, ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ కోదండ రామ స్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైన మరియు విశిష్టమైన పుణ్యక్షేత్రంగా భక్తుల విశేష ఆదరణపొందుతోంది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ఏకశిలా నిర్మాణం,అద్భుతమైన శిల్పకళ మరియు చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అదేవిధంగా ఒంటిమిట్ట ప్రాంతానికి ప్రతిరోజూ భక్తులు, పర్యాటకులు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు.అయితే ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ముఖ్యమైన రైళ్లకు తగినంత స్టాపింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాబట్టి భక్తులు, పర్యాటకులు మరియు స్థానిక ప్రజల సౌకర్యాన్నిదృష్టిలో ఉంచుకొని, ప్రయాణికుల రద్దీ మరియు ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకొని ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో మరిన్ని ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ (స్టాపింగ్) మంజూరు చేయవల సిందిగా మనస్ఫూర్తిగా కోరు తున్నాము అని ఏ డి ఆర్ ఎం కి కోదండ రామస్వామి వారి దర్శనం అనంతరం నందలూరు రైల్వే ఇన్స్పెక్టర్ పెంచలయ్య, రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు గురివిగారి వాసు, రాజంపేట జనసేన పార్టీ యువ నాయకులు కొరముట్ల హరి , రాజంపేట నియోజకవర్గ, నందలూరు మండల వాస్తవ్యులు తోట కేదార్నాథ్ బాబు, ఒంటిమిట్ట మండల నాయకులు మల్లేశ్వర రెడ్డి , సాయి తదితరులు పాల్గొన్నారు.