జనం న్యూస్ అక్టోబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామా నికి చెందిన అడప దేవేంద్ర, రోడ్డ రామచందర్ తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తమకే దక్కాలని కోరుతూ అనంతరం విలేకరులతో దేవేంద్ర, రామచందర్ మాట్లాడుతూ. తమ భూమి సర్వే నంబర్లు 678/1, 678/ఏ లో ఉన్న నాలుగెకరాల భూమిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించేందుకు సిద్ధపడగా. ఆరె మొగిలి చింతనిప్పుల భద్రయ్య, బొత్త కుమారస్వామి అడ్డుపడుతున్నారని వాపో యారు. ఈవిషయమై గ్రామ పెద్దమనుషుల సమ క్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ కొను గోలుదారు నుంచి తమకు రావాల్సిన డబ్బులు అం దకుండా మధ్యవర్తులు అడ్డుకుంటున్నారని అవే దన వ్యక్తం చేశారు. వాయిదాల పద్ధతిలో కొంత మొత్తం చెల్లించినప్పటికీ మిగతా డబ్బులు సర్వే నంబర్ తప్పు ఉందంటూ తమను పోలీస్ స్టేషన్ కు పిలించారని పేర్కొన్నారు. పోలీసే స్టేషన్లో తమపై ఒత్తిడి తెచ్చి మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కేసులు నమోదు చేస్తా మని బెదిరిస్తున్నారన్నారు. సర్వే నంబర్లో తప్పు ఉన్న విషయం గుర్తించిన నేపథ్యంలో భూ విక్రయా నికి సంబంధించి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తులు డబ్బులు స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం లేకుండానే మధ్యవర్తులు భూమి విక్రయానికి ప్రేరేపించారని ఇదిలా ఉండగా. సబంధింత వ్యక్తులు తమ భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్ తో దున్నుతున్నారని పేర్కొన్నారు. ఈవిష యాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని వాపోయారు. తమ భూమి విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.