జనం న్యూస్ 06 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ప్ర జావాణిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు గ్రంధాలయ పాఠకులు వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ సందర్భంగా పాఠకులు మాట్లాడుతూ గ్రంథాలయంలోని లైబ్రేరియన్ సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు కావున తక్షణమే అయన పైన చర్యలు తీసుకొని ఇక్కడినుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు ముఖ్యంగా మహిళ పాఠకులు బాత్రూంలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ ముందే ఆవేదన చెందారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా సమస్యల పైన ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాలకులు పట్టించుకోవడంలేదని అన్నారు బాత్రూంల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది మహిళా పాఠకులకు బాత్రూం లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. అదే విధంగా లైబ్రరీలో అప్డేట్ అయినా పుస్తకాలు లేక పాఠకులు ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం చాలా ఇబ్బందిగా మారినది. దీని పట్ల లైబ్రరీయన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయన నేను లక్ష యాభై వేల రూపాయలు ఇస్తాను కొత్త బాత్రూంలను నిర్మించండి అని, చెప్పిన ఇక్కడున్న గ్రంధాలయ సెక్రెటరీ, లైబ్రరీయన్ దాన్ని ముందుకు తీసుకవెళ్లడం లేదని తెలిపారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న లైబ్రరీలో సమస్యలు తీర్చాలి మరియు నిర్మాణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని కూడా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠకులు లక్ష్మీదేవి రామేశ్వరి మహేశ్వరి భవాని అనూష జ్యోతి ప్రియాంక మధుప్రియ శ్రావణి వనిత నీరజ కిరణ్ నటరాజ్ సునీల్ అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.