జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్ 09:. 10. 2026 జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్ లోని జాగృతి పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ ఎ. శశిధర్, చందుకళ, ఉపాధ్యాయ బృందం మరియు ఎమ్మెల్యే మాణిక్ రావు సమక్షంలో రాంనగర్ పరిసరాలలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ కోలాహలంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటేలా చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాణిక్ రావుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.