ఆంధ్రప్రదేశ్

కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో ఎన్నికలు

కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోలో ఎన్నికలు

ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన పోలింగ్‌ జనం న్యూస్: అక్టోబర్ 9 | తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రక్రియ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచే డిపో వద్ద సందడి నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్మికులు, నాయకులు డిపో వద్ద పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి, ఫతేనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు క్రాంతి కుమార్, అశోక్, నరేష్ కుమార్‌తో పాటు కార్మికులు అశోక్, ఆర్.హెచ్. రావు, శివ ముదిరాజ్, రామ్ రెడ్డి, ఉపేందర్ యాదవ్, అక్బర్, లక్ష్మి, సత్తెమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఈ ఎన్నికల ప్రక్రియలో నాయకులు, కార్మికులు పాల్గొని తమ తమ బాధ్యతలను నిర్వహించారు.

ఇ-పేపర్