ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు..!

డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు..!

బిచ్కుంద అక్టోబర్ 9 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుంద లో శుక్రవారం నాడు మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ పండుగ వేడుక ను నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు లు ముస్తాబై కళాశాలకు చేరుకుని రంగురంగుల పూలతో సాంప్రదాయంగా బతుకమ్మను పేర్చి విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో బతుకమ్మ పండగను సంబరంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ అని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకుపోవాల్సిన బాధ్యత విద్యార్థుల పై ఉందని తెలిపారు. అనంతరం రాజనీతి శాస్త్ర విభాధిపతి డా.టి.అశోక్ రావ్ పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.జి వెంకటేశం, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. టి.హన్మండ్లు, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డా.జి. రమేష్ బాబు,మహిళా సాధికారత విభాగం సమన్వయ కర్త వై.రేవతి అధ్యాపకులు, ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఇ-పేపర్