ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముఖ్య మంత్రి రేవంత్ జన్మదిన వేడుకలు

ఘనంగా ముఖ్య మంత్రి రేవంత్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ. పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా చక్రపాణి, మారపెల్లి రవీందర్, వైనాల కుమార్, చిందం రవి, సాధు నాగరాజు, మడికొండ రాజు, అబ్బు ప్రకాశ్ రెడ్డి, కొమ్ముల భాస్కర్, శానం కుమారస్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్