సెప్టెంబర్ మంగళవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ సిద్దిపేటలోని సన్ ప్రైమ్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట జిల్లా ట్రెస్మా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ఎస్. ఎన్. రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నూతన జిల్లా కమిటీ సభ్యులను ప్రకటించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్దిపేట జిల్లా ట్రస్మా అధ్యక్షుడిగా పడిగే భాస్కర్ బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాల,ప్రధాన కార్యదర్శిగా గాలిపల్లి హరినాథ్ నలంద విద్యాలయ, కోశాధికారిగా ఆర్. జీవరత్నం నిఖిలేశ్వరానంద హైస్కూల్ లను ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లా ట్రెస్మా అభివృద్ధికి, పాఠశాలల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌తో పాటు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిద్దిపేట జిల్లా ట్రెస్మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.