ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో కంకల్ ZPHS విద్యార్థిని జయభేరి

జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో కంకల్ ZPHS విద్యార్థిని జయభేరి

ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన గట్టుపల్లి వైష్ణవి విద్యార్థినిని అభినందించిన ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు జనం న్యూస్ 19 నవంబర్ వికారాబాద్ జిల్లా :- ఓటు హక్కు ప్రాముఖ్యత మరియు ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు, ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలలో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రహేలిక (క్విజ్) పోటీలలో పూడూరు మండలం, కంకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గట్టుపల్లి వైష్ణవి, జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులతో పోటీపడి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆమె త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలలో వికారాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించింది. ​గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల గ్రామస్తులు మరియు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని గట్టుపల్లి వైష్ణవిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి A. పుష్ప, గ్రామ సర్పంచ్ వీరేష్, రవీందర్ కంకల్, AAPC చైర్మన్ శ్రీమతి సోనీ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదలతో చదివి రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజేతగా నిలిచి పాఠశాలకు, కంకల్ గ్రామానికి, పూడూరు మండలానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

ఇ-పేపర్