వైస్ ఎంపీపీగా పి.ఎస్.ఎన్ రాజు ప్రమాణ స్వీకారం కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జనం న్యూస్ నవంబర్ 20: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ నూతన అధ్యక్షునిగా చెయ్యేరు 1 ఎంపీటీసీ సభ్యుడు చెల్లి సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ నూతన ఉపాధ్యక్షునిగా కాట్రేనికోన 1 ఎంపీటీసీ సభ్యుడు పిఎస్ఎన్ రాజు (విలేకరి రాజు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాట్రేనికోన ఎంపీటీసీ 2 నల్లా హరికిషోర్, కాటన్ 3 ఎంపీటీసీ గంటి వెంకట సుధాకర్, కాట్రేనికోన 4 ఎంపీటీసీ ఓలేటి నాగవేణి, బ్రహ్మ సమేధ్యం 1 రేఖాడి కుమారి, బ్రహ్మ సమేధ్యం 2 సంగాని రాంబాబు, చెయ్యేరు 2 నడింపల్లి శ్రీరాం వర్మ, దొంతికూరు మంగం దుర్గ, గెద్దనపల్లి కొప్పిగుంట, దంతులూరి సత్య ప్రశాంతి, కందికుప్ప 1 గడ్డం ప్రమీల, కందికుప్ప 2 గుద్దేటి జున్ని దివ్య కుమారి, పల్లం 1 దండుప్రోలు బాలయోగి, 2 బొమ్మిడి లింగేశ్వర స్వామి, నడవపల్లి కుండలేశ్వరం గిడ్డి రత్నకుమారి, పెనుముల్ల లక్ష్మీవాడ చీకరుమిల్లి రాజలక్ష్మి, ఉప్పూడి బంటుమిల్లి ఉందుర్తి ఏసురత్నం, పల్లంకురు 1 నల్లి వెంకటరత్నం, పల్లంకురు 2 జనుపల్లి నాగలక్ష్మి, పల్లంకురు 3 దొండపాటి వరలక్ష్మి, పల్లంకురు 4 ఓలేటి ఉమామహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నాగిడి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు, దాట్ల పవన్, వెంట్రు సుధీర్, మోకా బాల ప్రసాద్, విత్తనాల బుజ్జి, దండుప్రోలు సత్యం, మోకా అప్పాజీ తదితరులు సన్మానించారు. బీజేపీ నాయకులు గ్రంధి నానాజీ, సూరిబాబు, నంద్యాల చంటి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.