మానవత్వం చాటుకున్న సప్తగిరి కాలనీ వాసులు జనం న్యూస్ నవంబర్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో మానవత్వం, సేవాభావానికి నిదర్శనంగా అపార్ట్మెంట్ వాసులు నిలిచారు. ఎం.సి.ఆర్. మైథిలి అపార్ట్మెంట్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగరాజు కాలికి గాయం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ అధ్యక్షులు అభిలాష్ రెడ్డి, శివకుమార్‌తో పాటు అపార్ట్మెంట్ వాసులందరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి నాగరాజు కుటుంబానికి సుమారు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి చేతుల మీదుగా నాగరాజుకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం నిజమైన మానవ సేవ అని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా స్పందించి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. అపార్ట్మెంట్ వాసుల మంచి మనసు, సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. నాగరాజు కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన అపార్ట్మెంట్ అధ్యక్షులు, సభ్యులకు పేరుపేరునా పురేందర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి. సూర్యనారాయణ, విద్యాధరరావు, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.