ఆంధ్రప్రదేశ్

ప్రశాంత గణేష్ నిమజ్జన శోభాయాత్రకై పోలీసుల ప్రశాంత గణేష్ నిమజ్జన శోభాయాత్రకై పోలీసుల మార్గదర్శకాలు: బాలానగర్ ఏసీపీ

ప్రశాంత గణేష్ నిమజ్జన శోభాయాత్రకై పోలీసుల ప్రశాంత గణేష్ నిమజ్జన శోభాయాత్రకై పోలీసుల మార్గదర్శకాలు: బాలానగర్ ఏసీపీ

జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 25వ తేదీన జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, మండప నిర్వాహకులు పలు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముగిసేందుకు. భద్రత, పౌర సదుపాయాల పర్యవేక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ సుమారు 200 మందిపైగా పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
సైబరాబాద్ పోలీస్, సిఎంసీ, హైడ్రా, టిజిఎస్పీడీసీఎల్, జలమండలి సమన్వయంతో చేపట్టిన నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా నిర్వాహకులకు పోలీసుల ముఖ్యమైన, కీలక మార్గదర్శకాలు చేశారు. మండపాల వద్ద నిర్వహించే అన్నదానాలు, లడ్డూ వేలం, ఇతర కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉదయం 10′ గంటల నుంచి మధ్యాహ్నం 12′ గంటల మధ్యలోనే శోభాయాత్రను ప్రారంభించి, ఆలస్యం చేయకుండా అధికారులు నిర్దేశించిన నిమజ్జన ప్రదేశానికి చేరుకోవాలన్నారు.
విగ్రహాల తరలింపు మార్గంలో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు లేదా ఇతర అడ్డంకులు ఉంటే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శోభాయాత్రలో హైకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. డీజేల వినియోగం పూర్తిగా నిషేధం. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
విగ్రహాలను తరలించే వాహనాల కండిషన్‌ను, వాహన ఫిట్‌నెస్ ముందుగానే తనిఖీ చేసుకోవాలన్నారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే వాహనాలు నడిపేందుకు అనుమతించాలన్నారు.
ప్రతి విగ్రహం వెంట బాధ్యత కలిగిన నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని. రహదారులపై అనవసరంగా వాహనాలు నిలిపివేయకుండా, సాధారణ ప్రజలకు, ఇతర వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ప్రజల భద్రత కోసం, విస్తృతమైన అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టబడ్డాయని. నీటిలో నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించడానికి, సైబరాబాద్ పోలీస్, హైడ్రా అన్ని ప్రధాన సరస్సుల వద్ద ప్రత్యేక నైపుణ్యం గల ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో క్రేన్ కింద ఎవరూ నిలబడటం చేయకూడదు, చెరువులు లేదా ట్యాంక్‌లలోకి ఎవరూ నేరుగా దిగకూడదని సూచించారు. పూజా సామగ్రి, పూలను నీటిలోకి వెళ్లి వేయకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్త వహించాలన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రదేశంలో ఉండే పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని. 25న పెద్ద సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రతీకగా, శాంతియుత వాతావరణంలో, బాధ్యతాయుతంగా వ్యవహరించి, పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు. మార్గదర్శకాలు: బాలానగర్ ఏసీపీ ఈ నెల 25వ తేదీన జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులు, మండప నిర్వాహకులు పలు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముగిసేందుకు.. భద్రత, పౌర సదుపాయాల పర్యవేక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ సుమారు 200 మందిపైగా పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సైబరాబాద్ పోలీస్, సిఎంసీ, హైడ్రా, టిజిఎస్పీడీసీఎల్, జలమండలి సమన్వయంతో చేపట్టిన నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా నిర్వాహకులకు పోలీసుల ముఖ్యమైన, కీలక మార్గదర్శకాలు చేశారు. మండపాల వద్ద నిర్వహించే అన్నదానాలు, లడ్డూ వేలం, ఇతర కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. ఉదయం 10′ గంటల నుంచి మధ్యాహ్నం 12′ గంటల మధ్యలోనే శోభాయాత్రను ప్రారంభించి, ఆలస్యం చేయకుండా అధికారులు నిర్దేశించిన నిమజ్జన ప్రదేశానికి చేరుకోవాలన్నారు.
విగ్రహాల తరలింపు మార్గంలో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు లేదా ఇతర అడ్డంకులు ఉంటే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శోభాయాత్రలో హైకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. డీజేల వినియోగం పూర్తిగా నిషేధం. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
విగ్రహాలను తరలించే వాహనాల కండిషన్‌ను, వాహన ఫిట్‌నెస్ ముందుగానే తనిఖీ చేసుకోవాలన్నారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే వాహనాలు నడిపేందుకు అనుమతించాలన్నారు.
ప్రతి విగ్రహం వెంట బాధ్యత కలిగిన నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని. రహదారులపై అనవసరంగా వాహనాలు నిలిపివేయకుండా, సాధారణ ప్రజలకు, ఇతర వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ప్రజల భద్రత కోసం, విస్తృతమైన అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టబడ్డాయని. నీటిలో నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించడానికి, సైబరాబాద్ పోలీస్, హైడ్రా అన్ని ప్రధాన సరస్సుల వద్ద ప్రత్యేక నైపుణ్యం గల ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో క్రేన్ కింద ఎవరూ నిలబడటం చేయకూడదు, చెరువులు లేదా ట్యాంక్‌లలోకి ఎవరూ నేరుగా దిగకూడదని సూచించారు. పూజా సామగ్రి, పూలను నీటిలోకి వెళ్లి వేయకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్త వహించాలన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రదేశంలో ఉండే పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని. 25న పెద్ద సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రతీకగా, శాంతియుత వాతావరణంలో, బాధ్యతాయుతంగా వ్యవహరించి, పోలీస్ శాఖకు సహకరించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్