ఆంధ్రప్రదేశ్

చిట్కుల్ గ్రామంలో ఘనంగా శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

చిట్కుల్ గ్రామంలో ఘనంగా శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కే విట్టల్ రెడ్డి గారి నివాసంలో ఇందిరాగాంధీ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారత దేశ తొలి మహిళా ప్రధాని అలాగే ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ మన దేశానికి కాకుండా ఇతర దేశాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి విష్ణువర్ధన్ రెడ్డి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఉపాధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచు లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్