ఆంధ్రప్రదేశ్

ఇంటి వద్దకే వైద్యం

ఇంటి వద్దకే వైద్యం

ఆలనా వైద్య బృందం జనం న్యూస్ సెప్టెంబర్ 29 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలోని వివిధ కాలనీలలో సోమవారం జరిగిన పలురకాల కాన్సర్ వ్యాధి గ్రస్థులను పక్షవాతం వచ్చి ఇంటివద్దనే మంచానికి పరిమితం అయిన వ్యాధిగ్రస్థులను కామారెడ్డి నుండి వచ్చిన ప్రభుత్వ, ఆలనా వైద్య బృందం సందర్శించి వ్యాధిగ్రస్థులకు బీపీ ,షుగర్ పరీక్షలు చేసి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి , వాడుతున్న మందులను అడిగి తెలుసుకుని వారికి కావాల్సిన పలు ఆరోగ్య సూచనలు చేసి ,పౌష్టిక ఆహారం ప్రాముఖ్యతను వివరించి వారికి వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ వైద్యార్థికారిని డాక్టర్ శిరీష, ఆధ్వర్యంలో ఆలనా బృందం డాక్టర్ రాజేష్, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు హరిప్రసాద్, సుందరమ్మ, ఆశా కార్యకర్తలు జ్యోతి, మణెమ్మ, గంగజ్యోతి పాల్గొన్నారు.

ఇ-పేపర్