వైరల్ వార్తలు

జాతీయ పోషణ కార్యక్రమం.

జాతీయ పోషణ కార్యక్రమం.

జనంన్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 10 జాతీయ పోషణ మాసం సందర్భంగా రజక బజార్‌లోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ కె. శిరీష పాల్గొని అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్‌ను పరిశీలించారు.సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నెలరోజుల పాటు మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సూపర్‌వైజర్ లక్ష్మీదేవి తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, సమతుల్య ఆహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం రాధా, అంగన్‌వాడీ టీచర్లు పద్మావతి, నాసరమ్మ, శివ, అచ్చమ్మ, లలిత సత్యనారాయణమ్మ పాల్గొన్నారు.

ఇ-పేపర్