జనం న్యూస్ అక్టోబర్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఈ సంవత్సరం అమావాస్య రెండు రోజులు ముందు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో కూకట్పల్లి గ్రామంలో పలుచోట్ల మరియు కూకట్పల్లి హనుమాన్ దేవాలయం వద్ద సాయంకాలం ఐదు గంటల నుండి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్కడ ఆటలు ఆడిన తర్వాత బతుకమ్మలను పిఎన్ఎం స్కూల్ గ్రౌండ్ వద్ద మళ్లీ బతకమ్మలాడి తదనంతరం రంగదాముని చెరువులో నిమజ్జనం చేస్తారు అని, అక్కడ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు పర్యవేక్షించి అధికారులకి ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ బతుకమ్మలు ఆడేందుకు వచ్చే ప్రతి ఆడపడుచులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మున్సిపల్ శాఖ మరియు పోలీసు శాఖ వారికి కోరడం జరిగింది.
18.10.26 తారీకున పెద్ద బతుకమ్మ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతాయని బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.