జనం న్యూస్ అక్టోబరు 8 కోటబొమ్మాళి: మండల తులసిపేటలో ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ ఫెర్టిలైఫ్ డివిజన్ సౌజన్యంతో పాడి పశువుల వంధ్యత్వ నివారణ, అవగాహన శిబిరం నిర్వహించారు. పశువుల్లో ఎదకు రాకపోవడం, పదేపదే ఎదకు రావడం, తెల్లబట్ట, అండాశయ సమస్యలను గుర్తించి ఉచితంగా చికిత్స, మందులు అందించారు.నిమ్మాడ పశువైద్యాధికారి డా. ఎల్. కిరణ్‌కుమార్, జూనియర్ వైద్యాధికారి డా. ఎస్. లావణ్య, ఇంటాస్ ఏరియా బిజినెస్ మేనేజర్ టి. సురేష్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బి. రవి, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాడి రైతులకు సమతుల్య దాణా, మినరల్ మిక్చర్ వినియోగం, ఆరు నెలలకోసారి నట్టల నివారణ, కృత్రిమ గర్భధారణ అనంతరం మూడు నెలలకు గర్భ నిర్ధారణ పరీక్షపై అవగాహన కల్పించారు.శిబిరంలో మొత్తం 34 పశువులకు వైద్య సేవలు అందించగా. 13 ఎదకు రానివి, 8 పదేపదే ఎదకు వచ్చేవి, 7 గర్భ పరీక్షలు, 6 ఇతర సమస్యలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.