జనం న్యూస్ అక్టోబర్ 9 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ మర్రి మాదాపూర్ చౌరస్తా వద్ద జనగామ మాందాపూర్ వెళ్లే ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ ఎం పి పి రవీందర్ రెడ్డి, మాందాపూర్ సర్పంచి హరీష్ యాదవ్, సీతారాం పల్లి సర్పంచ్ సిద్ధ రాములు, ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు జీవన్ రెడ్డి, సిద్ధ రాంరెడ్డి, సాయి, జనగామ సీతారాంపల్లి మాందాపూర్ ఉపసర్పంచులు మాందాపూర్ జనగామ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.