
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 20-07-2026 సోమవారం రాష్ట్రంలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పెబ్బేర్ మహిళ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జయచంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఖాళీలు :-కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్-02, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ -04, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్-03 ఇంగ్లీష్ -01మాథ్స్-01 ఫిజిక్స్-01 కెమిస్ట్రీ -01 చొప్పున మొత్తం 13 ఖాళీలు కలవు.అభ్యర్థులు ఎం.ఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్, బీటెక్ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల23 గురువారం సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తు లు అందజేయాలన్నారు.24వ తారీకు శుక్రవారం అభ్యర్థులు మౌఖిక పరీక్షకు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ xerox, రెండు పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు తీసుకు రాగలరు.వివరాలకు 8096907523 నంబర్ ను సంప్రదించాలన్నారు.