అద్వాన్న స్థితిలో తోటపాలెం రోడ్డు పట్టించుకునే నాధుడే లేడా?

July 5, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్.గ్రామపంచా యతీ పరిధిలోగల తోటపాలెం వీధి లో ఉన్నటు వంటి రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతల మయం అయింది. మెటల్ రోడ్డు కంటే అద్వాన్నంగా తయార య్యిందని తోటపాలం వాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ రోడ్డు వెంటనే రైల్వే స్టేషన్ , జిల్లా పరిషత్ క్రీడమైదానం కు వెళ్ళ వలసి ఉంది. గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డులో స్వల్పపాటి వర్షం కురిసిన గుంతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో మాత్రం నాయకులు పలుమార్లు హామీ ఇచ్చినా తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ రహదారికి ఇరువైపులా అనుసంధానమైన రోడ్లు ఎత్తుగావేయడంతో ఈ మార్గం గుంతగా మారి అద్వాన్న స్థితిలో ఉంది. ఈమార్గంలో ఉన్నటు వంటి శ్రీ సీతారామ దేవస్థానం నందు వర్షపు నీరు నిలిచి బురద మయం అవుతున్నది. ఇకనైనా సంబంధిత అధికారులు ఈ మార్గాన్ని ఒకసారి పర్యవేక్షించి సిమెంట్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా గాంధీ నగర్ ,తోటపాలెం వాసులు కోరుతున్నారు .

🌐 Select Language:
📰 ePaper